Saturday, November 16, 2024

Phone Tapping case: 40 మంది మహిళలపై లైంగిక వేధింపులు

  • కానిస్టేబుళ్లూ ఆడేసుకున్నారు
  • ఫోన్​ ట్యాపింగ్​లో కొత్త కోణాలు

టీఎస్​, న్యూస్​: ఫోన్​ ట్యాంపరింగ్​ చేస్తూ ఎవరి స్థాయిలో వారు తమ పనులన్నీ చక్కబెట్టుకున్నారు. కోట్లకు కోట్లు దండుకున్న బ్యాచ్​ ఒకటైతే.. మహిళలను వేధించి, వారిని లైంగికంగా లోబర్చుకుని, వారిని ఉన్నతాధికారులకు కూడా ఎర వేసిన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్​ ఏకంగా 40 మంది మహిళలను ఇలా ఫోన్​ ట్యాపింగ్​తో లైంగిక వేధింపులకు దిగాడు. అంతేకాకుండా పోలీస్​ ఉన్నతాధికారులకు దగ్గరయ్యేందుకు కొంతమంది మహిళలను వారి దగ్గరకు పంపించినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసులో సిట్​ బృందం విచారణను స్పీడ్​ చేస్తున్నది. ఇందులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

నేడో, రేపో నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక, ఇప్పటి వరకు విచారణ చేస్తున్న సిట్​ పోలీసులకు ఇప్పుడు కీలక ఆధారాలు చిక్కుతున్నాయి. ఫోన్​ ట్యాపింగ్​ లో భాగస్వాములుగా ఉన్న ఇద్దరు అడిషనల్​ఎస్పీలు అప్రూవర్స్​గా మారేందుకు సిద్ధమయ్యారు. విచారణలో వారి పేర్లు బయటకు రావడంతో.. తాము అప్రూవర్​గా మారుతామని మధ్యవర్తులతో సమాచారం పంపించారు. దీంతో వారిని తాత్కాలికంగా విచారణకు పిలువరాదని సిట్​ బృందం నిర్ణయం తీసుకున్నది. ఈ కేసులో టెలిగ్రాఫ్​ చట్టం కింద నమోదు చేయాలంటే విట్​నెస్​లు ప్రధానంగా కావాల్సి ఉండటంతో.. వీరిద్దరు కీలకంగా మారనున్నారు.

ఆపరేషన్​ లేడీస్​ Operation Ladies
ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా రాధాకిషన్​రావును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు వస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు.. వ్యక్తిగత లబ్ది కోసం మరికొందరు ప్రయత్నించినట్లు నిర్ధారించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. అదే అదునుగా ఓ కానిస్టేబుల్ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళల వ్యక్తిగత జీవితాలతో ఆడుకున్నట్లు విచారణలో తేలింది. పలువురు మహిళలను కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

40 women sexually assaulted in phone tapping case1

అయితే, అప్పటి జిల్లా పోలీస్ బాస్‌తో సదరు కానిస్టేబుల్‌కు సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చొరవతోనే ఉన్నతాధికారులను సైతం భయపెట్టాడట. సదరు కానిస్టేబుల్​ఫోన్ ట్యాపింగ్‌తో జిల్లాలో పలు దందాల్లోనూ జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశాడు. రౌడీ షీటర్లతో సెటిల్‌మెంట్స్ చేయించి.. గుర్రంపోడ్ వద్ద ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయం చేయించాడు. నార్కట్‌పల్లి వద్ద గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించిన సదరు కానిస్టేబుల్ వారిని వేధింపులకు గురి చేశాడు. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి.. కోట్లు వసూలు చేసినట్లు తాజా విచారణలో వెల్లడైంది.

40 మంది మహిళలు బాధితులు 40 women were sexually assaulted
సుమారు 40 మంది మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగతంగా మాట్లాడుకున్న విషయాలను ట్యాపింగ్​ చేసిన సదరు కానిస్టేబుల్​, మరో ఇన్స్​పెక్టర్​ కలిసి వారిని లైంగింకంగా వాడుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పోలీస్​ అధికారులను మచ్చిక చేసుకునేందుకు వీరిలో చాలా మందిని అధికారుల దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశాడు. పేకాట దందాల్లో నెల నెలా మామూళ్లు వసూలు చేసేవారని తేలింది. ఇటీవలే ఈ కానిస్టేబుల్‌తో పాటు మరొకరిని హైదరాబాద్ టీమ్ అదుపులోకి తీసుకోగా.. విచారణలో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి.

40 women sexually assaulted in phone tapping case1

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన విపక్ష నేతల ఫోన్లను ప్రణీత్‌ రావు, ఇతర అధికారులు ట్యాప్ చేసినట్లుగా నివేదికలో వెల్లడైంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి నల్లగొండలోనే వార్ రూమ్ సెంటర్‌ నిర్వహించి ట్యాపింగ్ పాల్పడ్డారు. ఈ ట్యాపింగ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న ముగ్గురు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నల్లగొండలో వార్ రూమ్‌కు ఎవరు సహకరించారన్న దానిపై విచారణ బృందం ఆరా తీస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular