Monday, April 21, 2025

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలి

  • ఆగష్టు 20న రాజీవ్ విగ్రహాన్ని ఉప్పల్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేస్తా: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపి వి.హనుమంతరావు

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఉప్పల్ స్టేడియానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడగ్గానే ఒప్పుకున్నారని ఆయన గుర్తుచేశారు. రాజీవ్ పేరు ఉంది కానీ, అక్కడ ఆయన విగ్రహం లేదన్నారు.

స్డేడియంలో విగ్రహం ఏర్పాటు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అమలాపురంలో 13 అడుగుల ఎత్తు, వెయ్యి కిలోల కంచుతో తన సొంత ఖర్చుతో తయారు చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ విగ్రహాన్ని అంబేద్కర్ సన్మానించిన శిల్పి శ్రీనాథ్ వడియార్ వారసుడైన రాజ్కుమార్ వడియార్‌తో చేయించినట్లు విహెచ్ వివరించారు. రాజీవ్‌గాంధీ జయంతి రోజు ఆగష్టు 20వ తేదీన ఆయన విగ్రహాన్ని ఉప్పల్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలన్నదే తన కోరిక అని ఆయన తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com