Monday, May 20, 2024

రాజ్యాంగంతో పేదలకు బలమైన శక్తి

  • రాజ్యాంగంతో పేదలకు బలమైన శక్తి
  • రిజర్వేషన్లు రద్దు చేస్తే ఊరుకోం
  • కేవలం 2 శాతం మంది బిలీనియర్ల చేతిలో దేశ సంపద
  • కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ

టీఎస్​, న్యూస్​ :దేశంలో రెండు సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఒక వర్గం రాజ్యాంగాన్ని రక్షించాలని అంటోందని, మరో సమూహం రాజ్యాంగం అవసరం లేదు, రద్దు చేస్తామని అంటోందని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని, రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని తెలిపారు. ఎంతో గొప్పదైన మన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని పేర్కొన్నారు.

దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేలాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకసారి జనగణన చేస్తేనే, ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుందని తెలిపారు. మోదీ గత పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలను విక్రయించారని దుయ్యబట్టారు. కేవలం 2శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందని, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదని తెలిపారు.

బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామన్నారు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.8500 వేస్తామని పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular