Monday, November 11, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయుల సర్దుబాటు

  • స్కూళ్ల అవసరం మేరకు టీచర్లను
  • సర్దుబాటు చేయాలని నిర్ణయం

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు పెరగడంతో ఆయా పాఠశాలలకు అవసరం మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లోని పాఠశాలల్లోని అవసరాల మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవిఎన్ నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగానే జిల్లాల్లో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను గుర్తించి అక్కడ అదనపు టీచర్లను కలెక్టర్లు కేటాయించనున్నారు. పిల్లలున్న పాఠశాలల్లోనే టీచర్లు ఉండేలా, అవసరం మేరకు అదనపు టీచర్లను కేటాయిస్తున్నారు. విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండే పాఠశాలల నుంచి కొంత మంది టీచర్లను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. చాలా స్కూళ్లల్లో టీచర్ల కొరతతో పాటు సబ్జెక్టు టీచర్ల కొరత కూడా ఉంది. అయితే డిఎస్‌సి ఫలితాలు వెలువడి కొత్త టీచర్ల నియామకం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో పాఠశాలల వారీగా ఉపాధ్యాయులను కేటాయించనున్నట్లు సమాచారం.

కనీసం 10 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ తప్పనిసరి
రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కనీసంగా ఒకటి నుంచి 10 విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలని, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు టీచర్లు, 91 నుంచి 120 మంది విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లు ఉండేలా చర్యలు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే 121 నుంచి 150 మంది విద్యార్థులు ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేలా, 151 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటే ఆరుగురు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒక పాఠశాలలో 200 మంది కంటే ఎక్కువగా విద్యార్థులు ఉంటే ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా సర్దుబాటు చేయాలని పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular