రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అన్ని విషయాలపై అహగాహన ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్ అని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకాశం దక్కలేదని కానీ, ఆయనకు భవిష్యత్‌లో పెద్ద లీడర్ అవుతారని మంత్రి ప్రశసించారు. ఈ క్రమంలో అద్దంకి దయాకర్ మంత్రి కోమటిరెడ్డి కాళ్లకు నమస్కరించారు. టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇండియా ఫైల్స్’ ఆడియో రిలీజ్ వేడుకను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి అద్దంకి దయాకర్‌పై ప్రశంసలు కురిపించారు.
అయితే, గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ పరుష పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో టి-కాంగ్రెస్‌లో పెను దుమారం రేపగా దయాకర్ తరుఫున కోమటిరెడ్డికి స్వయంగా రేవంత్ రెడ్డి సారీ చెప్పారు. అయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పటి నుంచి దయాకర్‌పై కోపంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అద్దంకి దయాకద్ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ రాకుండా, ఎమ్మెల్సీ పదవి రాకుండా, ఎంపి టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలో తమ పరపతిని ఉపయోగించి అడ్డుపతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్ నటించిన సినిమా ఆడియో ఫంక్షన్‌కు మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా రావడం అద్దంకి దయాకర్ ఆయన కాళ్లు మొక్కడం జరిగింది.