Monday, March 10, 2025

రాహుల్ గాంధీ స్పీచ్‌లను చూసి బిజెపి నాయకుల్లో దడ మొదలైంది

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ స్పీచ్‌లను చూసి బిజెపి నాయకుల్లో దడ మొదలైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసిలకు వ్యతిరేకం కాదని భగవత్ చేసిన ప్రకటన రాహుల్ గాంధీ స్పీచ్ వల్లేనని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ నోటీసులు తీసుకురావటం కూడా దీనిలో భాగమేనని జగ్గారెడ్డి మండిపడ్డారు. మోడీ పదేళ్లు ప్రధానిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడుతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులపై, పుస్తెలపై హిందువులు ఫిర్యాదు చేసినా తాము ముక్కు నేలకు రాస్తామని, ఇన్ని అబద్దాల ప్రచారం చెయ్యమని మోడీకి నేర్పిస్తున్న వాళ్లు ఎవరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎన్నిక కమిషన్ రాజస్థాన్‌లో మోడీ ప్రసంగం మీద ఎందుకు నోటీసు ఇవ్వలేదని జగ్గారెడ్డి నిలదీశారు. ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిందని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. కెసిఆర్ మాటలకు విలువ లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశానికీ కాబోయే ప్రధాని అని, రాహుల్ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. తాళి బొట్టులను తెంచి ముస్లింలకు ఇస్తారని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com