సినిమాలతో సందడి చేస్తూనే సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో అలరిస్తోంది అనసూయ. మోడ్రన్ అండ్ శారీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. కుర్రకారును మైకం తెప్పిస్తోంది. పొట్టి డ్రెస్సులతో పాటు మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో గ్లామర్ షో చేస్తుంటోంది. తాజాగా ఆరెంజ్ కలర్ చీరకట్టులో పద్ధతిగా కనిపిస్తూనే నెట్టింట సెగలు పుట్టిస్తోంది అనసూయ. ఇక ఇలాంటి ఫొటోలకి కొంత మంది మంచి కామెంట్లు ఇచ్చినా మరికొంత మంది ఇంత అవసరమా నీకు అన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంత రెఢీ అయినప్పటికీ ఈ వయసులో అంత అవసరమా అన్నట్లు చూస్తారు కొంత మంది. అందులోనూ మొదటి నుంచి సినిమాల్లో నటిస్తే పర్లేదుకానీ బుల్లితెర నుంచి సినిమాల్లోకి వచ్చి కాస్త ఎక్కువ చేస్తే మాత్రం సోషల్‌మీడియాలో ఏంటి బయట కూడా చాలా మంది ఇలానే ఏదో ఒకటి కామెంటు చేస్తూ ఉంటారు మరి. ఎంత తనకు తను తగ్గేదేలే అనుకున్నా కూడా… కొంత మంది కాస్త తగ్గమ్మా అంటూ ఉంటారు.
తన చురకత్తి లాంటి చూపులతో నెటిజన్లను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. బ్లూ కలర్ గ్లాసెస్ తో కవ్విస్తున్న అనసూయ లుక్స్ వేరే లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్యాప్షన్ అదిరిపోయిందని చెబుతున్నారు. లాస్ట్ పిక్ లో టేబుల్ పై కూర్చున్న అనసూయను లేడీ బాస్ తో పోల్చుతున్నారు. రౌడీ బేబీలా ఉన్నారంటూ పొగిడేస్తున్నారు. తమ కామెంట్లతో బ్యూటీని ఇంకాస్త ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయ కొత్త పిక్సే కనిపిస్తున్నాయి. Also Read – ‘జరగండి జరగండి’ ఆగయా.. పాటలో ఏం మార్చారంటే.. ప్రస్తుతం అనసూయ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అల్లు అర్జున్ పుష్ప-2లో లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తోంది. అనసూయ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట. ఇటీవల రిలీజైన రజాకార్ సినిమాలో కూడా కనిపించింది అనసూయ. మరి వరుస చిత్రాలతో ఈ బ్యూటీ ఎలాంటి హిట్లు కొడుతుందో వేచి చూడాలి.