Monday, May 20, 2024

‘బాక్’ సెన్సార్ పూర్తి

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పంచుకో’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. అవ్నీ సినిమాక్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్‌ అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్ పి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular