Tuesday, May 21, 2024

తీర్పు రిజర్వు జైలుకే కవిత

టీఎస్​, న్యూస్​:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

కొడుకు కోసం బెయిల్​ ఇవ్వండి

ఈ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్‌ను అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో లేవనెత్తారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలన్నారు. ప్రధాని మోదీ చాలా సందర్భాలలో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. పరీక్షల సమయంలో పిలల్లకు తల్లి మద్దతు ఉండాలని.. తల్లి అరెస్ట్, పరీక్షల నిర్వహణ పిల్లోడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నారని లాయర్ సంఘ్వీ కోర్టుకు తెలియజేశారు. కవితకు మహిళగా, లేజిస్లేచర్‌‌గా బెయిల్ పొందొచ్చని, తన కుమారుడికి తల్లి సపోర్ట్ కావాలన్నారు. కవిత కొడుకు భయంలో ఉన్నాడన్నారు. తల్లితో ఉన్న ఆత్మీయత, అనుంబందాన్ని ఎవరూ తీర్చలేరన్నారు. మన కుటుంబాలకు ఓ విధానం ఉందని.. తల్లి పాత్ర చాలా కీలకమని చెప్పుకొచ్చారు. కొడుకు హైదరాబాద్‌లో ఉన్నాడని.. తల్లి జైల్లో ఉందని.. తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉన్నారని కవిత తరపు న్యాయవాది మను సంఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు.

కాగా, ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత వేసిన పిటిషన్​ను ఈడీ పూర్తిగా వ్యతిరేకించింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు లాయర్ తెలిపారు.

ఆమె కొడుకు ఒంటరిగా లేడు

ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది జోయబ్​ వాదిస్తే.. ‘‘కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నాడు. కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారు. అబ్బాయి చూసుకోవాడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయి. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని కోర్టుకు వెల్లడించారు.
‘‘కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత. కవిత మొబైల్ ఫోన్లను మార్చారు. ఆధారాలు ధ్వంసం చేశారు. ఫోన్లలో సమాచారాన్ని డిలీట్ చేశారు. 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపాం. 9 ఫోన్లను ఫార్మాట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. కవిత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు,కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వలేదు. ఫోరెన్సిక్ లాబ్ డేటా ప్రకారం 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయి. ఈ కేసులో వందల కొద్దీ డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ చేయబడింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది. లిక్కర్ వ్యాపారంలో కవిత వాటా 33 శాతం. మాగుంట రాఘవరెడ్డి వాటా 33 శాతం. దినేష్ అరోరా అప్రూవర్ మారాకా అన్ని విషయాలు చెప్పాడు. వంద కోట్ల రూపాయలు కవిత ఆలోచన మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటా రికవరీ చేశాము. ఆ డేటా ఆధారంగా కవితను విచరించాము. అరుణ్ పిళ్ళైతో కవితను విచారించాము. అప్రూవల్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారు’’ అని న్యాయవాది జోయబ్ హోస్సేన్ వెల్లడించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు. అలాగే కవితకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను తిరస్కరించాలని కోర్టును ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ కోరారు.

తీర్పు రిజర్వు

ఇరువర్గాల వాదనలు విన్న రౌజ్​ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వే చేసింది. దీనిపై సోమవారం తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే, రెగ్యులర్​ బెయిల్​ పిటిషన్​పై ఈ నెల 20న వాదనలు వింటామని వాయిదా వేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular