Monday, June 17, 2024

Bangalore rave party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం

  • నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు
  • కేసు విచారణపై టాలీవుడ్ ఆసక్తి
  • తెలంగాణ నార్కోటిక్ పోలీసు సైతం దృష్టి

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. డ్రగ్స్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని సినీ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిన 86 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఏ2 అరుణ్‌ కుమార్, ఏ4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో జీఆర్‌ ఫామ్‌హౌస్‌ యజమాని గోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. గోపాల్ రెడ్డి విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గోపాల్ రెడ్డి ఏ6 గా ఉన్నారు.

bangalure rave party latest updates

కేసు విచారణపై టాలీవుడ్ లో ఆసక్తి …

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారు బెంగళూర్ కు వెళ్ళి పోలీస్ విచారణకు హాజరుకావల్సివుంది. ఇదే విషయంపై సినీ ఇండస్ట్రీ (టాలీవుడ్) వర్గలలో చర్చానీయంశంగా మారింది. ఒకవేళ నటి హేమ పోలిసుల విచారణ హాజరైతే, ఆమె ఎలాంటి విషయాలు బయటపెడుతుందనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ అనేది సాధారణ అంశమే. అయితే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొందరికి పార్టీల్లో డ్రగ్స్ అలవాటు అవుతుంటుంది. మరి హేమా వ్యవహరంలో ఎవరు ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశారు..? ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటుంది..? ఈమె బ్యాచ్ లో ఉన్నది ఎవరు..? ఇలా అనేక విషయాలను బెంగుళూరు పోలీసులు కూపీ లాగనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దృష్టి Telangana Narcotics Police

Telangana Narcotics Police

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్రంలో నార్కోటిక్ ఎన్‌పోర్స్‌మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికినా, వెంటనే వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు రేవ్ పార్టీలోనూ ఎక్కడి నుండి డ్రగ్స్ ఆ పార్టీకి వెళ్లాయి అనే కోణంలో హైదరాబాద్ న్నార్కోటిక్ పోలీసులు ఆరా తీసున్నట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికింది తెలుగు వారు ఎక్కువగా ఉండటంతో వారి వివరాలను సైతం నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. నార్కోటిక్ పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తున్నారు.

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఫాంహౌజ్‌ల్లో నిరంతరం నార్కోటిక్ పోలీసుల తోపాటు స్థానిక పోలీసుల నిఘా ఉంటుంది. ఈ చర్యలు కారణంగానే కొందరు ప్రముఖులు హైదరాబాద్‌ను కాదని బెంగళూరుకు వెళ్లి మరి పార్టీలు చేసుకోవడం అలవాటు చేసున్నారు. రేవ్ పార్టీ బెంగళూరులో జరిగినప్పటికీ పట్టుబడింది తెలుగువారు ఎక్కువగా ఉండటంతో, మన రాష్ట్ర పోలీసుల దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ ఒక్క కేసుతో ఎన్నో చిక్కు ముడులు వీడే అవకాశం కోసం నార్కోటిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్టీకి హాజరైన డ్రగ్ కన్జ్యూమర్ల వివరాలు నార్కోటిక్ పోలీసుల చేతికి రానున్నాయి. దీంతోపాటు ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన పెగ్లర్లపై సైతం హైదరాబాద్ నార్కోటిక్క్ పోలీసులు కన్నేసి ఉంచుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా...?

Most Popular