Monday, June 17, 2024

విచారణకు రండి

  • విచారణకు రండి
  • నటి హేమతో సహా పలువురికి నోటీసులు
  • తెలంగాణ పోలీసులకు రేవ్​ పార్టీ జాబితా

ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో శనివారం బెంగళూరు పోలీసులు 8 మందికి నోటీసులు జారీ చేశారు. రక్త నమూనాలలో డ్రగ్స్ తీసుకున్నారని తేలినవారికి నోటీసులిచ్చారు. నటి హేమతో సహా వీరికి నోటీసులు ఇచ్చారు. సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట హాజరు కావాలని, ఉదయం 10 గంటలకు సీసీబీ ఎదుట హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులకు జాబితా

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సైతం దృష్టి సారించారు. తెలంగాణలో నార్కోటిక్ ఎన్‌పోర్స్‌మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికినా, వెంటనే వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ తరుణంలో బెంగళూరు రేవ్ పార్టీలోనూ ఎక్కడినుండి డ్రగ్స్ ఆ పార్టీకి వెళ్లాయి అనే వ్యవహారంలో హైదరాబాద్ న్నార్కోటిక్ పోలీసులు సైతం దృష్టిసారించారు. అందులోనూ ఈ పార్టీలో దొరికింది తెలుగు వారు ఎక్కువగా ఉండటంతో వారి వివరాలను సైతం నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో అలజడి రేపుతుంది. ఇప్పటికే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ 86 మందిలో అత్యధికంగా తెలుగు వారే ఉండటం, అందులోను సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ సైతం కన్నేసి ఉంచింది. అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్ళాయని అనుమానిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కూడా బెంగుళూరు పార్టీని చాలా సీరియస్‌గా గమనిస్తున్నారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారనుంది. సాధారణంగా మన దగ్గర డ్రగ్స్ కేసులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ బెంగళూరు లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్టులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా, డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇండస్ట్రీ పేర్లు ఎప్పుడు తెరమీదకి వచ్చినా, వారికి కేవలం నోటీసుల వరకు మాత్రమే విచారణ పరిమితం అవుతుంది. ఇండస్ట్రీకి డ్రగ్స్ కొత్త కాకపోయినప్పటికీ, తెలుగు ఇండస్ట్రీ పరువును పక్క రాష్ట్రాల్లో తీయడం ఒకరకంగా ఇండస్ట్రీకి పెద్ద మచ్చ లాంటిదేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు కేసు నమోదు అయింది బెంగళూరులో కాబట్టి ఒకసారిగా సినీ ఇండస్ట్రీ కూడా అలర్ట్ అయింది.. బెంగళూరు పోలీసులు నటి హేమకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లి పోలీస్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదే ఇండస్ట్రీ వర్గలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ హేమ పోలిసుల విచారణ హాజరైతే, ఆమె ఎలాంటి విషయాలు బయటపెడుతుందనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ వెరీ కామన్. అయితే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొందరికి పార్టీల్లో డ్రగ్స్ అలవాటు అవుతుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా...?

Most Popular