Thursday, December 5, 2024

పదేళ్లలో నగరానికి పైసా ఖర్చు చేయని బీఆర్‌ఎస్‌..

‌హైదరాబద్‌ ‌ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో సహా మంత్రిమండలి చర్చించి నగరానికి కావలసిన అన్ని హాంగులను తీసుకురావడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి రంగులు వేసుకొని పదేండ్లు కాలం వెల్లదీశారని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణం, నగరవాసులకు ఇప్పుడు అందుతున్న గోదావరి, కృష్ణ, మంజీరా నీటి పథకాలు ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు తెచ్చిన ఫలితమేనని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ ‌నగరంలో ఉద్యోగ ఉపాధి కల్పన కొరకు బీహెచ్‌ఈఎల్‌ ఈసీఐఎల్‌ ‌డిఆర్డిఓ ఐడిపిఎల్‌, ‌బీడీఎల్‌, ‌డిఆర్డిఏ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆనాటి కాంగ్రెస్‌ ‌పాలకులే తీసుకువచ్చారని వివరించారు. పేదలకు హౌసింగ్‌ ‌బోర్డ్ ‌ద్వారా ఎల్‌ఐజి, హెచ్‌ఐజి, ఎంఐజి ఇండ్లను అందించింది కూడా ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నాటి ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ తీసుకొచ్చిన కంప్యూటర్‌ ‌విప్లవమేనని పేర్కొన్నారు. హైటెక్‌ ‌సిటీ వేదికగా ఐటి రంగాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన వనరులు అందులో పనిచేయడానికి కావలసిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్‌ ‌కళాశాల ఏర్పాటు చేసి అందులో చదివిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌ఇచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్నిదని భట్టి విక్రమార్క  అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular