ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సిఎంను కలిశారు. ఈ సందర్బంగా బ్రహ్మణోత్తములు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలను అందజేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన నిరాటంకంగా సాగాలని వారు దీవించారు. పేదల సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని సిఎం ఆకాంక్షించారు.