Sunday, September 29, 2024

బీఆర్​ఎస్​లో గుత్తా టార్గెట్​

  • కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్
  • ఈసారి శాసన మండలి వేదికగా..!

తెలంగాణ శాసన మండలి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్‌కు వేదిక అవుతున్నది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రెడీ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో అవిశ్వాస తీర్మానం వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్న శాసన మండలి చైర్మన్ గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం నెగ్గితే రాజకీయంగా పైచేయి చాటుకోవచ్చని బీఆర్ఎస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సన్నద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మండలి ఛైర్మన్ గుతాపై బీఆర్ఎస్ పెట్టనున్న అవిశ్వాస తీర్మానం, దీన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అనుసరించనున్న వ్యూహాలు.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానాలతో అన్నింటిని కైవసం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు విజయ దుందిభీ మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన పెర్ఫామెన్స్ ప్రదర్శించ లేకపోయింది. మరోవైపు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్ ఖంగు తినిపించింది. శాసనసభలో బలం లేకపోయినా.. పెద్దల సభ శాసనమండలిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్, బిజెపిల వైపు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండడం, పార్లమెంట్ ఎన్నికల టైంలో సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్ చేరడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular