Thursday, May 15, 2025

బుల్లెట్ చిన్న చిత్రం కాదు.. మంచి సినిమా

శ్రీ బండి సదానంద్ & మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం బుల్లెట్. ఎవ్వడికైనా దిగుద్ది ట్యాగ్ లైన్ తో దర్శకుడు చౌడప్ప రూపొందించారు.

హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు. దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ..”బుల్లెట్ చిత్రం 50 రోజుల వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గోపీచంద్ ప్రభాస్ లాగా ఈ చిత్రంలోని హీరో రవివర్మ కూడా చాలా హైట్ ఉన్నాడు. తను కూడా వాళ్ళ లాగా సక్సెస్ అవ్వాలని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్” అని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com