Monday, May 12, 2025

Celebrities’ Vote: ఓటేసిన ప్ర‌ముఖులెవ‌రు.. ఫొటోలు

Celebraties Cast Their Vote In AP and Telangana

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తప్పకుండా ఓటేయాలంటూ సూచించారు. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫ్యామిలీతో కలిసి ఓటేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట కూతురుతో కలిసి మీడియాకు ఫొటోలకు పోజిచ్చారు.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబం సిటీలో ఓటు హక్కు వినియోగించుకుంది. భార్య, కూతురుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన సజ్జనార్.. క్యూలో నిలబడి ఓటేశారు. ఏపీలోని హిందూపురంలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటేశారు. భార్య వసుంధరతో కలిసి ఆర్టీసీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్‌బాబు, నాగచైతన్య, మంచు మనోజ్‌, విష్ణు, రాజమౌళి కుటుంబం ఓటు వేశారు. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన భార్యతో కలిసి సిద్దిపేటలోని అంబిటస్‌ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బాలయ్య దంపతులు..

హరీశ్ రావు దంపతులు..

కూతురుతో సీజేఐ..

సతీమణితో రాజమౌళి..

కొడుకుతో మోహన్ బాబు..

అశోక్ గజపతి రాజు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com