Wednesday, April 2, 2025

సిఎం రేవంత్‌రెడ్డితో ప్రముఖుల భేటీ

సిఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గురువారం భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరుపున తనను ఎంపిక చేసినందుకు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.

వెలిచాల రాజేందర్‌కు బిఫాం అందచేసిన సిఎం
మరోవైపు సిఎం వివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యనారాయణలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి బి ఫాం అందజేశారు. వీరితో పాటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి రామసాయం రాఘురాంరెడ్డి కూడా సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సిఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Tags: Celebrities, CM Revanth Reddy,Minister Ponnam Prabhakar, MLA Adi Srinivas

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com