Sunday, May 5, 2024

ఐపిఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసాలు జాగ్రత్త..!

  • క్రికెట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలి
  • టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్

ఐపిఎల్ టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, క్రికెట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ సూచించారు. సైబర్ నేరాగాళ్లు ఐపీఎల్ టికెట్లు కావాలా? అని సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పోస్టు చేస్తున్నారని హెచ్చరిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను ఎండి విసి సజ్జనార్ పోస్ట్ చేశారు. క్రికెట్ అభిమానులారా.. జాగ్రత్త! ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్,హైదరాబాద్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఐపిఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ రీల్స్, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయని ఆయన తెలిపారు.

ఎస్‌ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబి మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, ఇలాంటి పోస్టుల పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ లింక్‌లపై అసలు క్లిక్ చేయొద్దని, క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు గుల్లవుతుంది జాగ్రత్త! అని క్రికెట్ అభిమానులను ఆయన హెచ్చరించారు.
Tags: cyber scams, IPL tickets,TS RTC MD VC Sajjanar,

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular