Monday, May 12, 2025

ఎన్నికల బరిలో నలుగురు వారసులు

  • కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు తనయుల విజయం
  • బిజెపి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపి రాములు తనయుడి ఓటమి

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచిన నలుగురు వారసులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో ముగ్గురు విజయం వైపు దిశగా దూసుకెళ్లగా, నాగర్ కర్నూల్ నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపి రాములు తనయుడు భరత్ మాత్రం ఓటమి చెందారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు విజయం సాధించారు.

పెద్దపల్లి నుంచి పోటీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు, గడ్డం వంశీకృష్ణ తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌పై విజయం సాధించగా, వరంగల్ నుంచి బరిలోకి దిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, తన సమీప ప్రత్యర్థి ఆరూరి రమేశ్‌పై గెలుపొందారు. నల్లగొండ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com