సౌభాగ్యమ్మ లేఖకు రిప్లై
టీఎస్, న్యూస్: వైఎస్ వివేకా హత్యపై సౌభాగ్యమ్మ రాసిన లేఖకు సీఎం జగన్ స్పందించారు. సీఎం జగన్ రిప్లై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తున్నాయి. అవినాష్ ఏ తప్పు చేయలేదని, తాను బలంగా నమ్మబట్టే మరలా టికెట్ ఇచ్చానని స్పష్టం చేశారు. వివేకా చిన్నాన్నకు రెండో వివాహం ద్వారా సంతానం ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లంతా వైఎస్ వారసులు కాదన్నారు. దివంగత సీఎం వైసీఆర్ మీద కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు అని, వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో పేర్కొంది ఎవరు ఆని, వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లు వైఎస్సార్ వారసులా అని మండిపడ్డారు.
ALSO READ: మనోవేదన నీకు తెలుసు సీఎం జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ
పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా అని, కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు అని జగన్ అన్నారు. తన నాన్న శత్రువులతో తన చెల్లెలు చేతులు కలిపారని, నాన్న మరణం తరువాత కడప , పులి వెందుల గురించి నా ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా అని గుర్తు చేస్తున్న అన్నారు.