టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయ గౌడ్ మృతిపై సిఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతిపై మధుయాష్కీ కుటుంబసభ్యులకు సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూ తిని తెలియచేశారు.
వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని సిఎం భగవంతుడిని ప్రార్థించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. అనసూయ గౌడ్ మృతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.