Saturday, April 19, 2025

తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహం

పార్లమెంట్​ఎన్నికల వేళ రాష్ట్రానికి బీజేపీ ద్రోహాలు అంటూ వివిధ వర్గాలు చేస్తున్న ప్రచారం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నది. ఈ ద్రోహాల చిట్టా ఒక్కొక్కటిగా నినాదంగా మారుతున్నది.

ఇదే చిట్టా
1998లో తెలంగాణ ఇస్తామని కాకినాడ డిక్లరేషన్ చేసిన బీజేపీ, 2000లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా, తెలంగాణ ఏర్పాటును మాత్రం పట్టించుకోలే. పైగా, మోడీ పార్లమెంట్ సాక్షిగా పదే పదే తెలంగాణ ఏర్పాటును ఎగతాలి చేసిండు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలలోని 211 గ్రామాలను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 2400 MW ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్, గిరిజన, హర్టీకల్చర్ వర్సిటీ వంటి విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ బీజేపీ అమలు చేయలే.

నిధుల విడుదలలో వివక్ష:
పన్ను రాబడిలో తెలంగాణ వాటాను 27%కు పైగా తగ్గించడమే కాక, తెలంగాణ కేంద్రానికి రూపాయి పంపిస్తే, బీజేపీ కేవలం 43 పైసలని మాత్రమే తిరిగిస్తున్నది. అదే ప్రతి రూపాయికి బీహార్‌‌కు – రూ.7.06, యూపీకి రూ. 2.73, అస్సాంకు రూ. 2.63, మధ్య ప్రదేశ్‌కు రూ.2.42 ఇస్తుంది. తెలంగాణకు రావాల్సిన రూ. 4,000 కోట్ల జీఎస్టీ పరిహారం, నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ. 24,205 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్ రూ. 1,800 కోట్లను బీజేపీ విడుదల చేస్తలే.

cm revanth reddy fire on pm narendra modi

తెలంగాణకు 2024-25 బడ్జెట్లో బీజేపీ ఒక్క పైసా ఇవ్వలే. ములుగు ట్రైబల్ వర్సిటీకి, నిజామాబాద్ పసుపు బోర్డుకు రూపాయైనా కేటాయించలే. కుంభమేళాకు రూ.1000 కోట్లు.. సమ్మక సారక్క జాతరకు మాత్రం కేవలం 3.14 కోట్లు. తెలంగాణలో వరదలొస్తే బీజేపీ ఎలాంటి సాయం చేయలే. 2020లో తీవ్ర వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైనా ఎటువంటి సాయం చేయలే. 2023లో మహారాష్ట్రకు రూ.1,420.80 కోట్లు, ఒడిశాకు రూ.707.60 కోట్లు, బీహార్ రూ.624.40 కోట్లు, గుజరాత్ కు రూ.584 కోట్లను విపత్తు సహాయ నిధుల కింద ఇచ్చిన బీజేపీ, తెలంగాణను మాత్రం చిన్నచూపు చూసింది.

రైతులు, పేదలు, యువతకు ధోఖా
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను దక్కకుండా చేస్తూ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. 2022 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, తెలంగాణలో అసలు ఇండ్లే కట్టలే. హైదరాబాద్‌లోని BDL, HAL, DMRL, BHEL, రైల్వేస్, HMT, ప్రాగా టూల్స్, BSNL, LIC, మిధాని, DRDL వంటి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కారణంగా 1.5 లక్షల ఉద్యోగాల నష్టం.

ప్రాజెక్టుల కేటాయింపులో మోసం:
పాలమూరు – రంగారెడ్డి సహా తెలంగాణలోని ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు బీజేపీ జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలే. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసిన ఫలితంగా, తెలంగాణకు 13.9 లక్షల ఉద్యోగాలు, రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడుల నష్టం. తెలంగాణలో ఫ్యాబ్ సిటీ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధులను కేటాయించలే. ఫలితంగా రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడి, 16 లక్షల మంది యువతకు ఉపాధి నష్టం.

cm revanth reddy fire on pm narendra modi

హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్స్, నారాయణపేట హ్యాండ్లూమ్ పార్క్‌ ఏర్పాటు, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణనూ గాలికొదిలేసింది. తెలంగాణలో కొత్తగా ఒక్క విమానాశ్రయాన్ని గానీ, డ్రైపోర్ట్ లేదా పారిశ్రామిక పార్కును గానీ బీజేపీ ఏర్పాటు చేయలే. వరంగల్, కరీంనగర్‌‌లను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దలే. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన గనులను బీజేపీ ప్రైవేటీకరిస్తోంది. కల్యాణ్ ఖని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రవణపల్లి బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టింది. మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం రోడ్-సత్తుపల్లి, పెద్దపల్లి-నిజామాబాద్, మెదక్-అక్కన్నపేట మార్గాల్లో రైల్వే లైన్లు, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్, ముద్ఖేడ్-మేడ్చల్ రైల్వే లైన్ల డబ్లింగ్‌, కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో రైల్వే లైన్ నిర్మాణంలో బీజేపీ విఫలమైంది.

విద్యా సంస్థల ఏర్పాటులో మోసం
తెలంగాణకు ఒక్క ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్శిటీ, మెడికల్ కాలేజీనైనా బీజేపి ఇయ్యలే.
2014 నుండి ఒక్క జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా తెలంగాణకు మంజూరు చేయలే. సైనిక్‌ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో వివక్ష చూపించింది.

దేశాన్ని అమ్మేస్తున్న మోడీ
రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం రూ.6 లక్షల కోట్లకే కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టిండు. మోడీ ప్రియ మిత్రుడు అదానీకి దేశంలోని 30 శాతం పోర్టులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్, బొగ్గు నిల్వలను అప్పగించిండు. స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన నల్లధనం. రూ.8,392 (2015) కోట్ల నుండి రూ.30,500 (2021) కోట్లకు పెరుగుదల. రూ.37,000 కోట్ల మేర బ్యాంకులను ముంచిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు మోడీ హయాంలో విదేశాలకు పరారీ. పాలు, ఉప్పు, పప్పుపై కొత్తగా జీఎస్టీ విధిస్తూ, కార్పొరేట్ పన్నులు మాత్రం 8% తగ్గించి, దేశానికి రూ.1.84 లక్షల కోట్ల నష్టం చేసిన మోడీ.

రైతు వ్యతిరేకి బీజేపీ
2014 నుండి బీజేపీ హయాంలో లక్షకు పైగా రైతుల ఆత్మహత్య. నల్ల సాగు చట్టాలతో వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసే బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమం అణచివేత. 700 మందికి పైగా రైతుల ప్రాణాలు బలి. రైతు రుణమాఫీ చేయలే కానీ, కార్పొరేట్లకు మాత్రం రూ.25 లక్షల కోట్ల రుణాల మాఫీ.

సామాన్యుడిపై ధరల మోత 
పదేళ్లలో బియ్యం, పప్పు, నూనె, పాలు, మరియు చక్కెర ధరలు మూడింతలు.
రూ.110 దాటిన పెట్రోల్, రూ.100 దాటిన డీజిల్, రూ.1200 దాటిన సిలిండర్ ధర.

పబ్లిసిటీ సర్కార్
మోడీ పబ్లిసిటీ కోసం రూ.10 వేల కోట్ల ప్రజాధనం వృధా.
బేటీ బచావో, బేటీ పడావో నిధుల్లో 80% పబ్లిసిటీకే ఖర్చు.
దాదాపు అన్ని టీవీ & ప్రింట్ మీడియా సంస్థల కొనుగోలు.

Electoral Bonds Scam

ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్
ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రూ.3.8 లక్షల కోట్ల భారీ స్కామ్. బీజేపీకి చందాలిచ్చిన ఫార్మా కంపెనీలకు నకిలీ మందులు తయారు చేసేందుకు అనుమతి. ప్రైవేటు కంపెనీల దగ్గర పార్టీ ఫండ్స్ తీసుకుని ప్రాజెక్టుల మంజూరు. IT, ED, CBI దాడుల నుండి రక్షణ.

నిరంకుశత్వ మోడీ
ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా, రాజ్యాంగాన్నే మార్చేస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్న బీజేపీ. 7 రాష్ట్రాల్లో 300కు పైగా ఎమ్మెల్యేలు & ఎంపీలను కొని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా IT, ED, CBI కేసులు.

దేశ సార్వభౌమత్వానికి భంగం
మోడీ హయాంలో 2000 చదరపు కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా.
రక్షణ దళాలలో 1.55 లక్షలకు పైగా ఖాళీలుంటే, బీజేపీ తెచ్చిన అగ్నిపథ్ కింద కేవలం 10,000 ఖాళీల భర్తీతో నిర్వీర్యం దిశగా భారత సైన్యం. మోడీ అసమర్థ విదేశాంగ విధానంతో చైనాకు దగ్గరవుతున్న భారత ఇరుగు పొరుగు దేశాలు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోడీ
కులగణన నిర్వహణను వ్యతిరేకిస్తున్న మోడీ. మోడీ పాలనలో ప్రతిరోజూ దళితులపై 157, ఆదివాసులపై 28 దాడులు. 2022లో అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరిచి, 2,19,923 ఎకరాల అటవీ భూములను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిన మోడీ.

ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం
రూ.55 లక్షల కోట్ల నుండి రూ.183.67 లక్షల కోట్లతో, దేశం మీద పదేండ్లలో మూడింతలైన అప్పు .
ప్రతి పౌరుడి నెత్తి మీద రూ.1.51 లక్షల అప్పు భారం. డాలర్ తో రూపాయి విలువను రూ.40 కి తీసుకొస్తానని చెప్పి రూ.85 కు దిగజార్చిన మోడీ.

Increased unemployment

పెరిగిపోయిన నిరుద్యోగం
గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి నిరుద్యోగం. నిరుద్యోగులుగా 42% యువత.
ఖాళీలున్నా బీజేపీ భర్తీ చేయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షలు. PSUల ప్రైవేటీకరణతో కోల్పోయిన ఉద్యోగాలు 2.7 లక్షలు.

మోడి జుమ్లాలు 
ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తాం
2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
2022 కల్లా అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం
100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తం
నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తాం
అవినీతిని పూర్తిగా రూపుమాపుతాం
నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన
దేశ భూభాగంలో చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com