Wednesday, April 2, 2025

నేడు సోషల్ మీడియా టీంతో సిఎం ఆత్మీయ సమావేశం

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్‌తో ముఖ్యమంత్రి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి( మీట్ విత్ చీఫ్ మినిస్టర్) శుక్రవారం (నేడు) ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్- జూబ్లీహిల్స్‌లోని సిబిఐ కాలనీ రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి టి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

మాకు మీడియానే లేదు. కాంగ్రెస్‌కు పేపర్ లేదు. టివి లేదు. మా కార్యకర్తలే మా జర్నలిస్టులు. మా కార్యకర్తలే మా రిపోర్టర్లు. వాళ్లే సోషల్ మీడియాలో ఒకరైదుగురికి ఠాగూర్ సినిమాలో పంపించినట్లుగా ఒకరు ఒక ఐదు మందికి, నాలుగు కోట్ల మందికి చేరేవరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేర్చమని చెబుతున్నాం. విఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ సోషల్ మీడియా అని రేవంత్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.
Tags: CM revanth reddy, social media team,Meet with Chief Minister

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com