Tuesday, January 7, 2025

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి

జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి..
తెలంగాణ భవన్‌లో కవిత

ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలేకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారితో పాటుగా వివిధ ప్రాంతాల్లో హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, తదితరులు సావిత్రీబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె స్ఫూర్తిని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినదించి, సమాజంలో మేం సగం అని ఎదగడానికి కారకులయ్యారని ఈ సందర్భంగా కొనియాడారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com