-
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆదాయం 3067 కోట్లు
-
రాష్ట్ర ఆదాయం 6972 కోట్ల లో 44% ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దే
-
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్.
టీఎస్, న్యూస్:ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి,వికారాబాద్ జిల్లాలకు సం యుక్తం గా 3143 కోట్లు ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించగా 3067 కోట్లు ఆదాయాన్ని సాధించాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ వెల్లడించారు. గత సంవత్సరం ఆదాయం తో పోలిస్తే 9 .9 శాతం వృద్ధి రేటు సాదించామని ఆయన తెలిపారు. జిల్లాల పరం గా రంగారెడ్ది జిల్లా రూ. 1689 కోట్లు, మేడ్చల్-మల్కాజిగిరి రూ. 1298 కోట్లు వికారాబాద్ రూ. 80 కోట్లు కలిపి రూ. 3067 కోట్ల ఆదాయం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ ఆదాయం రాష్ట ఆదాయం రూ. 6972 కోట్ల లో 44% ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేనని తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో ని మణికొండలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని చంద్రశేఖర్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనదారులు పన్నులు చెల్లించాలని లేని పక్షం లో తనిఖీలలో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడం తో పాటు భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. ఓవర్ లోడ్ తో తిరిగే వాహనాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 2024-25 లో సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశం లో ఆర్ టి వోలు రఘునందన్, సుభాష్ చందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.