Tuesday, April 22, 2025

ఉప రాష్ట్రపతి జగదీప్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయండి

  • అధికారులకు ఆదేశించిన సిఎస్

ఉప రాష్ట్రపతి జగదీప్ థన్కర్ ఈ నెల 26వ తేదీన రాష్ట్రానికి వస్తున్నందున తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సిఎస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్తు చేయాలని పోలీసు శాఖను సిఎస్ ఆదేశించారు.

ఈ పర్యటనలో సరిపడా వైద్య సిబ్బందితో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖకు ఆమె సూచించారు. భారత ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు సిఎస్ సూచించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అదే విధంగా అగ్నిమాపక శాఖ తగిన అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలన్నారు. డిజిపి రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గవర్నర్ కార్యదర్శి బి.వెంకటేశం, ఫైర్ సర్వీసెస్ డిజి నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, టిఎస్‌ఎస్పీడిసిఎల్ ఎండి ముషారఫ్ అలీ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com