Saturday, May 4, 2024

‘కల్పన అనేది అబద్ధం లోపల దాగున్న నిజం’

  • పుస్తకాలను బెస్ట్ ఫ్రెండ్‌గా మార్చుకోండి
  • ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో స్మితా సబర్వాల్ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. స్మితా సబర్వాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లెవరూ ఉండరు. కెసిఆర్ సర్కారు హయాంలో ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ట్రెండింగ్ టాఫిక్‌లపై స్పందిస్తూ తన అభిప్రాయాలను, తన పర్సనల్ జీవితంలోని విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్లతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు కొన్ని సార్లు ఇంట్రస్టింగ్ ట్వీట్‌లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మన ఆలోచనలను విస్తరించేందుకు…
తాజాగా మంగళవారం రోజున ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ను స్మితా సబర్వాల్ చేశారు. ‘కల్పన అనేది అబద్ధం లోపల దాగున్న నిజం’ అంటూ ఆమె అసక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలను బెస్ట్ ఫ్రెండ్‌గా మార్చుకోండి. మీ మెదడు యొక్క ఆలోచనలను విస్తరించేందుకు కొన్ని ఆలోచనల నుంచి తప్పించుకునేందుకు శిక్షణ ఇచ్చే ఏకైక ట్రైనర్ పుస్తకమే అంటూ ఆమె ఆలోచింపజేసే ట్వీట్‌ను స్మితా సబర్వాల్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు తాను పుస్తకం చదువుతున్న ఫొటోను ఆమె పంచుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular