Saturday, September 21, 2024

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ దిశానిర్ధేశం

  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ దిశానిర్ధేశం
  • కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో
  • మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జీల సమావేశం
  • 15 సీట్ల గెలుపే లక్షంగా ముందుకు సాగాలని కేడర్‌కు సూచన

లోక్‌సభ ఎన్నికల ప్రచార బరిలో మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు. కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, 10 సంవత్సరాలుగా బిజెపి వల్ల దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు, నోట్ల రద్దు తదితర అంశాలను ప్రజలకు తెలియచెప్పాలని మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కేడర్‌కు సూచిస్తున్నారు. 15 సీట్ల గెలుపే లక్షంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేలా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని ప్రజలకు తెలియచెప్పాలని, రానున్న రోజుల్లో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వాలని మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు నిరంతరం సమీక్షలు జరిపి కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.

బిఆర్‌ఎస్, బిజెపిల గురించి ప్రజలకు తెలిసేలా….

ప్రస్తుతం బిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థులకు కొరత ఉంది. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిని మళ్లీ తీసుకువచ్చి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. ఈ రోజు ఆ పార్టీల పరిస్థితి గురించి ప్రజలకు తెలియచెప్పాలని, 10 ఏళ్ల అధికారంలో బిఆర్‌ఎస్ చేసిన పాపాలను ఒక్కోక్కటిగా ప్రజలకు వివరించాలని, గతంలో గెలిచిన బిజెపి ఎంపిలు రాష్ట్రం కోసం ఏమీ చేయలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా తీసుకురావడంలో నిర్లక్షం వహించారని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియచెప్పాలని కేడర్‌కు వారు దిశానిర్ధేశం చేస్తున్నారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని బిజెపికి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని, ఈ విషయమై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని వారు కేడర్‌కు సూచిస్తున్నారు. సోనియాగాంధీ త్యాగం, గొప్పతనం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని దానిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు సూచిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular