Saturday, September 21, 2024

నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు

  • నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు
  • ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో 50 నుంచి -60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేటి నుంచి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

మంగళవారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డిలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. గురువారం నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular