Thursday, December 26, 2024

కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్‌ హౌస్ అరెస్టు

హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తున్న బక్క జడ్సన్‌ను శనివారం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ తాను పార్టీ నుంచి కేవలం సస్పెండ్ మాత్రమే అయ్యానని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడినేనని ఆయన తెలిపారు.

Also Read: తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు..

కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను అరెస్టు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. టిడిపి నుంచి వచ్చిన వ్యక్తి సిఎం అయి ఇంకా మమ్మల్ని శత్రువులను చూసినట్టు చూస్తున్నాడని జడ్సన్ మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు రూ. 7 వేల కోట్లు ఎవరి అకౌంట్‌లోకి మళ్లీంచారో రాహుల్ గాంధీని కలిసి అడుగుతానని ఆయన తెలిపారు. తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో కూడా అడుగుతానని బక్క జడ్సన్ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com