Monday, May 6, 2024

తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు..

తిరుపతిలో ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు.. గజ రాజుల విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత కొద్ది రోజులుగా ఏనుగుల హల్‌చల్‌తో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. రేణిగుంట మండలం చైతన్య పురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. గతం లోనూ ఇలాంటి దాడులు జరిగాయని రైతులు వాపోతున్నారు. గజ రాజుల విహారంపై అటవీ శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యం అని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి మామిడి చెట్లను రక్షించు కోవడానికి ప్రాణాలకు తెగించి తమ వద్ద నున్న బాణాసంచాను పేల్చి రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేశారు. అయినా, ఎలాంటి లాభం లేకుండా పోయిందని అన్నదాతలు చెబుతున్నారు. పూర్తిగా నష్టపోయిన తమను ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular