హైదరాబాద్: కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పర్చారు.
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.
అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత వారం జగజ్యోతి నివాసంలో సోదాలు చేసిన అధికారులు రూ. 65,50,000 నగదు, రూ. 1,51,08,175 విలువైన 3.639 కిలోల బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
భూముల విలువ అంచనా వేయాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ. 50 కోట్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు..