Friday, September 20, 2024

మందగించిన ఖరీఫ్ !

24జిల్లాలలో 50శాతం మించని విస్తీర్ణం
రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా గట్టి వానలు పడనేలేదు. అడపా దడపా కురుస్తున్న వర్షం నేలతడుపులతోనే సరిపెడుతుంది. వాగులు వంకలు ప్రవహించేంత వర్షం లేకపోవటంతో సాగునీటి ప్రాజెక్టులకు నీటి చేరికల మాట అటుంచి కనీసం వ్యవసాయ బోర్లకు అందేంటంత స్థాయిలో భూగర్భ జలమట్టాలు కూడా పెరగలేదు. రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఖరీఫ్ పంటల సాగు లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి 1.19కోట్ల ఎకకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అయితే సీజన్ సాధారణ విస్తీర్ణంలో సగటున 42.23శాతం విస్తీర్ణంలో పంటలు సాగులొకి వచ్చినప్పటికీ పలు జిల్లాలు పంటల సాగులో బాగా వెనుబడి ఉన్నాయి.

హైదరాబాద్ అర్బన్‌జిల్లా మినహా మిగిలిన 32జిల్లాల్లో 24జిల్లాలు ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో 50శాతం మించటం లేదు. అదిలాబాద్ , కోమరంబీమ్ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం ఇప్పటికే 76నుంచి 100శాతం చేరువలో ఉన్నాయి. నిర్మల్ , నిజామాబాద్ ,సంగారెడ్డి, వరంగల్ ,భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలు 51శాతం నుంచి 75శాతం మేరకు పంటల సాగు లక్ష్యాల దిశగా సాగుతున్నాయి. మరో 16జిల్లాలలో 26నుంచి 50మేరకు పంటలు సాగులొకి వచ్చాయి. కరీంనగర్ , పెద్దపల్లి, జగిత్యాల, మెదక్, ములుగు, మేడ్చెల్ , వనపర్తి, సూర్యాపేట జిల్లాలు పంటల సాగులో బాగా వెనకబడిపోయాయి. ఈ జిల్లాల్లో సాగు విస్తీర్ణం 25శాతం లోపే ఉన్నట్టు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూన్ ప్రారంభం నుంచి ఈ సీజన్‌లో ఇప్పటివరకూ సాగులోకి వచ్చన పంటల్లో జొన్న, మొక్కజొన్న, కంది , పెసర, మినుము , వేరుశనగ, సోయాబీన్ , ఆముదం, పత్తి పైర్లు పెరుగుదల దశలో ఉన్నాయి.

వరినార్లు పెరిగిపోతున్నాయ్:
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో రెండు రకాల పంటలే అత్యధిక శాతం విస్తీర్ణంలో సాగులోకి రానున్నాయి. తొలకరి వర్షాల ప్రారంభం నుంచి ఇప్పటికే 36.88లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. మొత్తం ఈ సీజన్‌లో 50.48లక్షల ఎకరాల్లో పత్తిసాగును ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. వరిసాగు విస్తీర్ణం లక్ష్యాలు కూడా భారీగా ఉన్నాయి. మొత్తం 57లక్షల ఎకరాల్లో వరిసాగు లక్షంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 4.14లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. అదికూడా వ్యవసాయ బోర్ల కింద వరినార్లు పోసుకున్నారు. అడపా దడపా పడుతున్న వర్షాలతో వరినార్లు పెరిగిపోతున్నాయి. మరో రెండు వారాల్లో వరి నారుమళ్లు నాటుకు సిద్దం కానున్నాయి. ఆ లోపు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులకు నీరు చేరితే వరినాట్లు ప్రారంభించికోవచ్చని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు.మరో వైపు రాష్ట్రంలో కనీసం నాలుగైదు రోజులపాటు తెరిపిలేకుండా వర్షం కురిసే వర్షపు నీరు నేలలో ఇంకి పోయి భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం వ్యవసాయ బోర్ల కింద అయినా వరినాట్లు ప్రారంభించుకోచ్చని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos