Sunday, May 19, 2024

బెయిల్ రాలే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత్ కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ కేసు, సిబిఐ కేసులోను బెయిల్ మంజూరు కు నిరాకరించిన న్యాయస్థానంతీర్పు వెలువరించింది. న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈడి, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడి, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిసాయి. దీంతో.. సోమవారం కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించారు.లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తిహాడ్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడి, సీబీఐ కేసులో కవిత బెయిల్‌ కోసం గత నెల 22న రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2కు తీర్వు రిజర్వు చేశారు.
అయితే, మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా.. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మే 6కు రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరి స్తామని స్పష్టం చేసిన న్యాయమూర్తి .. కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular