- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న
- సీనియర్ నేత బక్క జడ్సన్ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్
పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై టి- కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న సీనియర్ నేత బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో బక్క జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.
కాగా, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై పలుమార్లు బక్క జడ్సన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. షోకాజ్ నోటీసులకు బక్క జడ్సన్ ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని క్రమశిక్షణా కమిటీ తాజాగా బక్క జడ్సన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.