Tuesday, May 6, 2025

బెయిల్​ రాలే కవితకు మళ్లీ నిరాశ

టీఎస్​, న్యూస్​:దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని జడ్జి కావేరి బవేజా గురువారం ప్రకటించారు. కాగా, ఇదివరకే కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఏప్రిల్ 22న తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. నేడు (గురువారం) జైలా లేదా బెయిలా అనేది తేలుతుందని అంతా భావించారు. కానీ కవితను నిరాశకు గురిచేస్తూ తీర్పును మరోసారి కోర్టు వాయిదా వేసింది.

మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని వాదనలు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్‌గా ఉన్నందున ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసునని, ఇతరులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని కోర్టుకు సీబీఐ న్యాయవాదులు తెలిపారు. హై పొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com