Friday, December 27, 2024

ఫోన్​ ట్యాపింగ్​లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్​

  • ఫోన్​ ట్యాపింగ్​లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్​
  • కేసీఆర్​ కనుసన్నల్లో ఫాంహౌస్​ కేసు

టీఎస్​, న్యూస్​:తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫాంహౌస్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గురువారం నాడు ఆయన మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. మాజీ డీసీపీ రాధ కిషన్ రావు పోలీస్ కస్టడీపై కోర్టు అనుమతితో ఆయనను తిరిగి కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 10 తేదీ వరకు టాస్క్ ఫోర్స్ రాధా కిషన్ రావు‌ను విచారిస్తుందని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో కుట్రధారుడిగా రాధా కిషన్ రావు ఉన్నారని చెప్పారు.

ఈ కేసులో కొంతమంది ప్రముఖుల ప్రొఫైళ్లను అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పలువురి ప్రొఫైళ్లని రాధా కిషన్ రావు తయారు చేశాడని వెస్ట్‌జోన్ డీసీపీ వెల్లడించారు. ఆయన బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడని, కాంగ్రెస్‌కి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయించాడన్నారు. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకి రాధాకృష్ణ సహకరించాడని, పలువురి ప్రొఫైల్స్‌కు సంబంధించిన వ్యవహారాలను బయటకు రాకుండా ఉండటానికి ఆధారాలను ధ్వంసం చేశారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌ వల్లే ఫాంహౌస్​ కేసు

కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోమాజీ డీసీపీ రాధ కిషన్ రావు పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. ఫాంహౌస్ ఎపిసోడ్ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్‌ వల్లే జరిగినట్లు హైదరాబాద్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫాంహౌస్‌లో ఆపరేషన్ కంటే ముందు రాధ కిషన్ రావు 74 డివైసులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ నడిచినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారం రాధ కిషన్ రావు పరిధిలో లేకపోయినా గత కేసీఆర్ ప్రభుత్వం ఆయన కనుసన్నుల్లోనే నడిపించినట్లు తెలుస్తోంది. నంద కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫాంహౌస్ ఎపిసోడ్‌కు రాధ కిషన్ రావు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కేసులో భాగంగానే సీసీటీవీ కెమెరాలను ఐటీ ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి రమేష్ రావు మానిటరింగ్ చేసినట్లు తెలుస్తోంది. రాధ కిషన్ రావుని కస్టడీకి అనుమతిస్తే మొదట ఫాంహౌస్ కేసుపై హైదరాబాద్ పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైస్‌ను రాధ కిషన్ రావు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com