Tuesday, April 22, 2025

చేవెళ్ల ముఖ చిత్రాన్ని మార్చగలిగే సామర్ధ్యం రంజిత్ రెడ్డికే ఉంది

సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్
రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తే పట్టు వదలని విక్రమార్కుడిలా సేవ చేస్తారని, చేవెళ్ల ముఖ చిత్రాన్ని మార్చగలిగే సామర్ధ్యం ఆయనకే ఉందని సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనం సభకు హజరైన ఆయన కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి రంజిత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.

రంజిత్ ఫోన్ వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఒకటే నంబర్ వాడుతున్నారని, చేవెళ్లలోని లక్షల మంది కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తుతారని, ఎవరు ఫోన్ చేసినా ఒక్క రింగ్‌కే ఫోన్ ఎత్తే ఎంపి ఈ భారతదేశంలోనే ఎవరూ ఉండరని, అది కేవలం రంజిత్ రెడ్డి మాత్రమేనని ఆయన తెలిపారు. చేవెళ్లలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తెలంగాణలో చేవెళ్ల ముఖ చిత్రాన్ని మార్చి అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఏ మాత్రం సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. రంజిత్ రెడ్డి రాముడి లాంటివాడని, ఆయన సతీమణి, మా వదినమ్మ సీతమ్మ లాంటిదని ఆయన అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com