మోడీని ప్రజలు తిరస్కరించారు
కాంగ్రెస్ మాజీ ఎంపి వి.హనుమంత రావు
మోడీ పదేళ్లలో ఏం చేయలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపి, వి.హనుమంత రావు ఆరోపించారు. ఇచ్చిన హామీలను మోడీ నిలబెట్టుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సంబురాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసారి మోడీని ప్రజలు నమ్మలేదన్నారు. మోడీ దేవుడు మీద ఆధారపడినా ప్రజలు ఆదరించ లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 44 సీట్లు కూటమి గెలుస్తుదంటే మోడీని ప్రజలు తిరస్కరించారన్నారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్ ఫెయిల్యూర్ వల్లే బిజెపి 8 సీట్లు గెలించిందన్నారు. కెసిఆర్ ఇక్కడి రైతులను పట్టించుకోక బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. మోడీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చూస్తే తనకు నిద్రపట్టలేదని, మీడియా మొత్తం ఉదరగొట్టిందన్నారు. రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అన్యాయం జరుగుతుందని గుర్తించారన్నారు. రిజర్వేషన్ పెంచేందుకు కులగణన చేయాలని భావించారన్నారు.
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రాజ్యసభ ఎంపి అనిల్ కుమార్
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి మోడీ ప్రధాని పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు మద్ధతు పలికి ప్రజలు 8 స్థానాలు గెలిపించారని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌తో బిజెపి పార్టీ లోపాయికారీ ఒప్పందం చేసుకొని తమ అభ్యర్థులను గెలిపించుకుందని ఆయన ఆరోపించారు. మోడీ గ్యారంటీ ఎక్సఫయిరీ అయిపోయిందన్నారు.