Monday, March 10, 2025

‘మీరు డోర్లు తెరిచారు..కాంగ్రెస్‌కు మోసం చేసిన

  • దొంగలు కాంగ్రెస్ పార్టీ లోపలికి వస్తున్నారు’
  • సిఎం ఎదుట మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో చేరికల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కెఎల్‌ఆర్) సిఎం రేవంత్ రెడ్డి ఎదుటే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు డోర్లు తెరుస్తామని అంటున్నారు. కాంగ్రెస్‌కు మోసం చేసిన దొంగలను కూడా పార్టీ లోపలికి తీసుకువస్తే మా లాంటి నాయకులు, కార్యకర్తలు మళ్లీ చనిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం Malkajigiri Parliamentary Constituency మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సిఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా Former MLA Kitchannagari Lakshmareddy కెఎల్‌ఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డికి కెఎల్‌ఆర్‌కు పడటం లేదని ప్రచారం జరుగుతోందని కానీ, నిజానికి తామిద్దరం చాలా దగ్గరి వారిమని కెఎల్‌ఆర్ చెప్పుకొచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com