సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. నూతనకల్ (మం) మిర్యాల గ్రామంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మెంచు చక్రయ్య గౌడ్ (70)పై సోమవారం సాయంత్రం ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ చక్రయ మృతి చెందారు.
చక్రయ మృతికి పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి ఐదుగురు కుమార్తెలు కాగా రెండో కుమార్తె మిర్యాల గ్రామానికి తాజా మాజీ సర్పంచ్. దీంతో రెండో అల్లుడు (రెండో కూతురు భర్త) ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషయమై సూర్యాపేట డిఎస్పి జి రవి మాట్లాడుతూ చక్రయ్య పై మొత్తం 13 మంది వ్యక్తులు దాడి చేశారని, మృతురాలి మరో కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.