పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు. విద్యార్థులు తమ వద్ద ఉన్న బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఎగ్జామ్ హాల్ వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఏప్రిల్ 2 వరకు జరిగే పరీక్షలకు రాష్ట్రంలో 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.