Monday, May 20, 2024

టిజితో రవాణా శాఖకు కాసుల వర్షం

  • టిజితో రవాణా శాఖకు కాసుల వర్షం
  • మూడు రోజుల్లో సుమారుగా రూ.4 కోట్ల పైచిలుకు ఆదాయం
  • ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం ఎగబడిన వాహనదారులు

వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త కోడ్ (టిజి) రవాణా శాఖకు కాసులు కురిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.4,29,99,293.00 కోట్ల ఆదాయం రవాణా శాఖకు సమకూరగా, గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ మూడు జిల్లాల నుంచే సుమారుగా రూ.1.32 కోట్ల ఆదాయం రావడం విశేషం. అన్ని కార్యాలయాల్లో టిజితో పాటు 0001 కొత్త సీరిస్ ప్రారంభం కావడంతో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త కోడ్ రవాణా శాఖకు కాసులు కురిపించింది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకోవడానికి వాహనదారులు ఆసక్తి చూపించారు. ఆన్‌లైన్‌లో పోటాపోటీగా బిడ్డింగ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టిజి 09,0001 నెంబర్ ఏకంగా రూ.9,61,111 ధర పలకడం విశేషం. రాజీవ్‌కుమార్ ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఈ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. టిజి 09 0909, టిజి 09 0005, టిజి 09 0002, టిజి 09 0369, టిజి 09 0007 నంబర్ ప్లేట్లకు వరుసగా రూ.2.30 లక్షలు, రూ.2.21 లక్షలు, రూ.1.2 లక్షలు, రూ.1.20 లక్షలు, రూ.1,07 లక్షలకు వాహనదారులు కొనుగోలు చేశారు. దీని ద్వారా మొత్తం రూ.30,49,589 ఆదాయం రవాణా శాఖకు సమకూరింది. రానున్న రోజుల్లో ఫ్యాన్సీ నంబర్లకు మరింత డిమాండ్ ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పాత విధానం ప్రకారమే నెంబర్లకు నిర్ణీత ఫీజు: హైదరాబాద్ జేటిసి

ఖైరతాబాద్, టోలిచౌకీ, మలక్‌పేట, బండ్లగూడ, తిరుమలగిరి, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, కూకట్పల్లి, మేడ్చల్‌లో కొత్త కోడ్‌లతో అధికారులు ఈ రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఫ్యాన్సీ సిరీస్ నంబర్ల కోసం అధికారులు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించగా విశేష స్పందన వచ్చింది. 0009, 0999 లాంటి నెంబర్‌ల కోసం వాహనదారులు పోటీపడి మరీ దక్కించుకున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టిఎస్ కోడ్‌తోనే రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 15రోజుల వరకు పాత స్లాట్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసినవారికి మాత్రం టిజి కోడ్ సిరీస్‌ను కేటాయిస్తున్నారు. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహన యజమానులకు మాత్రమే టిజి నంబర్ ప్లేట్‌లు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘టిఎస్’ నుంచి ‘టిజి’గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది. పాత విధానం ప్రకారమే నెంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని హైదరాబాద్ జేటిసి రమేష్ తెలిపారు.

జిల్లాల వారీగా వచ్చిన ఆదాయం

మారిన కోడ్ నేపథ్యంలో వాహనదారులు జిల్లాల వారీగా ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం మూడు రోజుల్లో రవాణా శాఖకు సమకూరింది. ఆదిలాబాద్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా రూ.4,15,392ల ఆదాయం సమకూరింది. భద్రాద్రి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.10,41,234ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. హన్మకొండ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా రూ.9,99,744ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. హైదరాబాద్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.97,08,048ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. జగిత్యాల జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.5,63,400ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. జనగాం జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.1,05,300ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.88,000ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. జోగులాంభ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.2,88,610ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. కామారెడ్డి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.2,44,607ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. కరీంనగర్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.11,85,441ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. ఖమ్మం జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.13,53,810ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. కుమురంభీం జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.32,527ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.3,83,100ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. మహబూబాబాద్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.45,200ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. మంచిర్యాల జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.4,21,552ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. మెదక్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.2,33,600ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.58,62,134ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. ములుగు జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.72,000ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.6,66,711ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. నల్లగొండ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.6,82,514ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. నారాయణపేట జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.2,76,000ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. నిర్మల్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.3,46,818ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. నిజామాబాద్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.11,61,912ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. పెద్దపల్లి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.5,15,516ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.4,37,000ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. రంగారెడ్డి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.78,98,715ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. సంగారెడ్డి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.36,06,087ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. సిద్ధిపేట జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.3,98,447 ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. సూర్యాపేట జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.10, 38, 240ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. వికారాబాద్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.11,80,880ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. వనపర్తి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.11, 80, 880ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. వరంగల్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.05,30,217ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్‌ల ద్వారా మొత్తం రూ.7, 53, 438ల ఆదాయం ఆ జిల్లాకు సమకూరింది. మొత్తం మూడురోజుల్లో (15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు) రాష్ట్రవ్యాప్తంగా రూ.4,29,99,293 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular