Friday, April 4, 2025

కామ్రెడ్లతో కాంగ్రెస్​ స్నేహబంధం

టీఎస్​, న్యూస్​: రాష్ట్రంలో కాంగ్రెస్​, కమ్యూనిస్టుల స్నేహబంధం బలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తో పొత్తు కుదుర్చుకున్న సీపీఐ..లోక్​ సభ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 19 స్ధానాల్లో ఒంటరిగా బరిలో దిగిన సీపీఎం ఈ ఎన్నికల్లో కేవలం ఒక్క భువనగిరి నుంచే పోటీకి సిద్ధమైంది. అలాగే పోటీ చేసే స్ధానం మినహా మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్​ గెలుపునకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే ఇండియా కూటమీలో భాగస్వాములైన ఆయా పార్టీలు కలిసి పోటీ చేయడం రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలుపు అవకాశాలను పెంచుతోంది.

మరోవైపు సీఎం రేవంత్​ రెడ్డి సైతం.. కాంగ్రెస్​ కు కమ్యూనిస్టులకు దోస్తీ కుదిరిందంటూ సోమవారం ట్విట్​ చేశారు. కామ్రెడ్లతో కలిసి రాష్ట్రంలో తాను లక్ష్యంగా నిర్దేశించుకున్న స్ధానాల్లో గెలుపు బావుటా ఎగురవేస్తామంటూ అందులో ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులతో భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లోక్​ సభ ఎన్నికల్లో వారి మద్దతు కోరడం.. దానికి ఆయా నేతలు సముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్​ పూర్తి గెలుపు ధీమాతో ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com