Sunday, September 29, 2024

బక్రీద్ సందర్బంగా 7 లక్షల ధర పలికిన మేకపోతు

* బక్రీద్ సందర్బంగా 7 లక్షల ధర పలికిన మేకపోతు
* ఈ మేకపోతు ప్రత్యేకతలు ఎన్నె మరెన్నో
బక్రీద్‌.. ముస్లిం సోదరుల పవిత్రమైన పండగ. బక్రీద్ అంటేనే బక్రా తెగాల్సిందే. అదేనండీ బక్రీద్ పండగ సందర్బంగా ప్రతి ముస్లిం సోదరుడు మేకపోతును బలిచ్చి దావత్ చేసుకోవడం ఆనవాయితీ. బక్రీద్ పండగకు పేద, ధనిక బేదం లేకుండా ప్రతి ముస్లిం చిన్నదో పెద్దదో మేకపోతును కోసి పండగ చేసుకోవడం ఆనవాతిగా వస్తోంది. సైజు, బరువును బట్టి కనీసం 5 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు మేకపోతు ధర పలకడం సహజం. కానీ మేకపోతు ధర 7 లక్షల రూపాయలు పలికితే..
ఏంటీ నమ్మలేకపోతున్నారా.. బక్రీద్ సందర్భంగా భోపాల్‌లో ఓ మేకపోతు ఏకంగా 7 లక్షల రూపాయల ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేంది. పుణెకు చెందిన ఓ వ్యక్తి పోటీ పడి మరీ ఆ మేకపోతును కొనుగోలు చేశాడు. ఇంత భారీ ధర పలికిన ఈ మేకపోతుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మేకపోతు బరువు 155 కిలోలు. అంతే కాదు నాలుగు అడుగుల ఎత్తు ఉంది. ఇక ఈ మేక పోతును ప్రత్యేకంగా పెంచారట. సెంద్రీయ పద్దతిలో పెంచిన ఆకులు అలములు తినిపించి ఎంతో శ్రధ్దతో పెంచడంతో పాటు దాని గంబీరం, బలం, ఎత్తు, బరువు అన్నీ కలిపి అత్యధిక ధర పలకడానికి కారణమని చెబుతున్నారు.
బక్రీద్ సందర్బంగా ఈ మేకపోతును కొనుగోలు చేసిన పూణేకు చెందిన వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేకపోతు మాంసం ఎంతో రుచిగా ఉంటుందని, ఇది తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమైన విషయమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా బక్రీద్ పండగ వేల ఇలా ఓ మేకపోతు 7లక్షల రూపాయల ధర పలకడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular