Wednesday, February 12, 2025

తక్షణమే సహాయక చర్యలు చేపట్టండి

  • జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
  • లోతట్టు కాలనీలు, ట్రాఫిక్, విద్యుత్ సమస్యపై సమీక్ష
  • సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సిఎం పిలుపు

భారీ వర్షం, ఈదురుగాలులతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్‌కో సిఎండి ఎస్.ఏ.ఎం రిజ్వి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

CM Revanth Reddy

స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన చేయూతను అందించాలని సిఎం సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com