Thursday, April 3, 2025

హైదరాబాద్​ ఎంపీ అభ్యర్థిగా డా. లుబ్నా

ప్రకటించిన విద్యార్థుల రాజకీయ పార్టీ

టీఎస్​, న్యూస్​: కార్పొరేట్​ స్కూల్స్​, ఆస్పత్రుల్లో ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన విద్యార్థుల రాజకీయ పార్టీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఈ మేరకు పార్లమెంట్​ ఎన్నికల్లో హైదరాబాద్​ పార్లమెంట్​ స్థానం నుంచి అభ్యర్థిగా పర్యావరణ, సామాజిక, రాజకీయ వేత్త డా. లుబ్నా సర్వత్​ను ప్రకటించారు.

హైదరాబాద్​లో మహిళా సాధికారిత సంక్షేమం కోసం స్థానిక పోలీసులతో కలిసి డా. లుబ్నా అనేక కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్​ పాతబస్తీ పరిస్థితులను, అక్కడ చేయాల్సిన అభివృద్ధి అంశాలపై దృష్ఠి సారించారు. ఈ మేరకు ఒక నివేదికను సైతం తయారు చేశారు. వక్ఫ భూముల పరిరక్షణ, అవినీతి రహిత సమాజం కోసం అనేక కార్యక్రమాల్లో లుబ్నా భాగస్వాములయ్యారు. హైదరాబాద్​ పార్లమెంట్​ స్థానంలో డా. లుబ్నాను పోటీకి దింపుతున్నట్లు విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షుడు సునీల్​ ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com