Friday, November 22, 2024

Hydra Commissioner సుప్రీంకోర్టు తీర్పా.. తూచ్​.. మాకు వర్తించదు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

బుల్డోజర్లతో కూల్చివేతలపై సుప్రీం కోర్టు తాజాగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు సంచలనంగా మారాయి. అయితే, హైదరాబాద్‌లో అలజడి సృష్టించిన హైడ్రా.. ప్రస్తుతం కాస్త విరామం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కూల్చివేతలకు 15 రోజుల ముందు ఆ నిర్మాణ యజమానికి నోటీసులు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు.. తమకు వర్తించదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా.. హైడ్రా కమిషనర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

దేశంలో బుల్డోజింగ్ విధానంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కేవలం ఆరోపణలతోనే ఏకపక్షంగా పౌరుల ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగ చట్టాన్ని, అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది. నిందితుల ఇళ్లను బుల్డజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దేశవ్యాప్తంగా బుల్డోజర్‌ యాక్షన్‌కు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలకు 15 రోజుల ముందు భవన యజమానికి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని.. రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణానికి నోటీసులు అంటించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తావించారు. నీటి వనరులు, రోడ్లు, ఫుట్‌‌పాత్‌‌లు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వర్తించదని రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ చట్టం-405 ప్రకారం రోడ్డు, చెరువులు, నాలాలు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి నోటీసు జారీ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఓసారి స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్.. అదే విషయాన్ని మరోసారి వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular