Tuesday, May 13, 2025

‘వెయ్ దరువెయ్’ పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు… ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్ ఈ మూవీ గురించి చెప్పారు. సాయిరామ్ శంకర్ తో సినిమా చేస్తున్నానని చెప్పాను. తను డిస్ట్రిబ్యూటర్ గా నాకు పరిచయం. సినిమాలపై మంచి జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు వెయ్ దరువెయ్ సినిమాతో దర్శకుడిగా మారి పక్కా ప్లానింగ్ తో సినిమా చేశారు. నిర్మాత దేవరాజ్ గారికి అభినందనలు.

సాయిరామ్ శంకర్ పట్టుదలతో చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సాయిరామ్ శంకర్‌గారు ఫికర్ మత్ కరో అనే డైలాగ్ చెబుతుంటారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గారు తగ్గేదే లే అని ఎలా అందరితో అనిపించారో.. ఈ వెయ్ దరువెయ్ సినిమాలో సాయిరామ్ అందరినోట ఫికర్ మత్ కరోఅనిపిస్తారని, సినిమా పెద్ద హిట్ అయ్యి, సాయిరామ్‌కి పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు నవీన్ చాలా మంచి టైటిల్ పెట్టారు. సినిమాకు దర్శకుడు తండ్రిలాంటి వ్యక్తి. నవీన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాను 35 రోజుల్లో పూర్తి చేయటం గొప్ప విషయం. నిర్మాత దేవరాజ్ బాగుండాలనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేసి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసిన నవీన్ గారికి థాంక్స్.

నిర్మాత దేవరాజ్ పోతూరుగారికి ఆల్ ది బెస్ట్. కె.జి.యఫ్ తో యష్ ఎంత పెద్ద స్టార్ అయ్యారో, ఈ సినిమాతో హీరోయిన్ యష పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు భీమ్స్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తను ప్రతీ సినిమాకు దుమ్ము రేపుతున్నాడు. తనకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిపై వెయ్ దరువెయ్ అని దర్శకుడు అన్నారు. సమాజంలో చైతన్యం నింపేలా మంచి మెసేజ్‌తో సినిమా చేసిన టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com