Thursday, May 16, 2024

ప్ర‌జాస్వామ్యం నుంచి నియంతృత్వం దిశ‌గా భార‌త్‌?

ప్ర‌జాస్వామ్యానికే పెట్టింది పేరైన భార‌త‌దేశం క్ర‌మ‌క్ర‌మంగా నియంతృత్వం వైపు మ‌ళ్లుతుందా అంటే.. ఔన‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొంత‌కాలం నుంచి దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూస్తుంటే.. వివేకం ఉన్న ప్ర‌తిఒక్క‌రికి అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌కు ఏసీబీ, ఈడీ, ఇన్‌క‌మ్ ట్యాక్స్ నోటీసుల్ని పంపించ‌డం.. వ‌రుస‌గా వేధించ‌డం.. అవ‌స‌ర‌మైతే వారిని జైలులో వేయించ‌డం వంటిది స‌ర్వసాధార‌ణ‌మైంది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతం చేయ‌డానికి బీజేపీ ప‌క్కా స్కెచ్ వేసింది. గ‌త ఏడాదిలో ఆయ‌న మీద ప‌రువు న‌ష్టదావా కేసు వేసి ఆయ‌న్ని ఎంపీగా అన‌ర్హుడిగా చేయ‌డానికి ప్ర‌ణాళిక‌ను ర‌చించింది.

సూరత్ కోర్టు అయితే ఏకంగా రాహుల్ గాంధీ మీద రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఆత‌ర్వాత సుప్రీం కోర్టు ఆ తీర్పుపై స్టే విధించింది. లేక‌పోతే, ఈ రోజు దేశంలోని రెండు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన టాప్ లీడ‌ర్లు జైలులో మ‌గ్గేవారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్ని పూర్తిగా స్తంభింప‌జేయంతో వారు ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌లేక‌పోతున్నారు. గ‌తంలో ఎప్పుడో ప‌న్ను క‌ట్ట‌లేద‌ని ప‌దిహేడు వంద‌ల కోట్ల జ‌రిమానా ఇన్‌క‌మ్ ట్యాక్స్ విభాగం కాంగ్రెస్ పార్టీ మీద వేసింది. క‌మ్యూనిస్టు పార్టీ మీద కూడా ప‌ద‌కొండు కోట్లు నోటీసు క‌ట్ట‌మ‌ని నోటీసు ఇచ్చిన‌ట్లు తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular